చిమన్‌పల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడల వైపు మళ్లాలి – ఎమ్మెల్యే సూచన…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం చిమన్‌పల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడల వైపు మళ్లాలని సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె నరేష్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెలిమెల నరసయ్య, పుప్పాల సుభాష్, మిట్టపల్లి గంగారెడ్డి, నరసయ్య, హమీద్, బాలు నాయక్ తదితరులతో పాటు ధర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























