డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా: భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఒక వ్యక్తికి ఆర్మూర్ రెండవ న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్ష విధించింది.
ఈ సందర్భంగా భీంగల్ పోలీసులు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. వాహనదారులు ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

























