ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా : ధర్పల్లి ఎలిని నో ప్రభావం ఉన్నందున, మండలంలోని 22 గ్రామాల్లో ఎవరు కూడా కొత్తగా బోర్లు వేయరాదని, మండల అభివృద్ధి అధికారి మారుతి గురువారం సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని ప్రజలు ఈ మేరకు తమతో సహకరించాలని ఆయన సూచించారు. ఎలినినో ప్రభావంతో రాబోయే రోజుల్లో భూగర్భ జిల్లాలో అడుగంటి పోయే ప్రమాదం ఉన్నందున, కొత్తగా బోర్లు వేస్తే నీటి సమస్య అధికమవుతుందని సూచించారు. ఈ నిర్ణయాన్ని ఎవరో అతిక్రమించినా చర్యలు ఉంటాయన్నారు.























