ఆలయ నిర్మాణానికి అటవీ భూమి బదలాయింపు చేయాలి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి బదలాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఎమ్మార్వో టీ శాంతా కు వినతిపత్రం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం పెద్ద ఆలయం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి సహకరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు























