ధర్పల్లి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి బుధవారం పరామర్శించారు. ముందుగా చల్లగర్గ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు శ్రీధర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అనంతరం మైలారం గ్రామానికి చెందిన కోలి రంజిత్ తండ్రి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆపదలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవడం తన బాధ్యతని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చెలిమెల శ్రీనివాస్ మండల అధ్యక్షులు గాదె నరేష్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

























