సహకార వ్యవసాయ బ్యాంకు నందు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ట్రైనింగ్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
బుధవారం నర్ ఆన్ జాబ్ ట్రైనింగ్ లో భాగంగా భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈరోజు సహకార వ్యవసాయ బ్యాంకు నందు విద్యార్థులు పలు విషయాలపై తర్ఫీదు పొందుతూ, సహకార బ్యాంకు అధికారులు ఇచ్చినటువంటి పనిని విద్యార్థులు నేర్చుకుంటూ వాటిపట్ల అవగాహనను పెంచుకున్నారు. అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి రికార్డ్స్ లను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలోని పనితీరును గమనించి సందేహనివృత్తిని విద్యార్థులు చేసుకున్నారు. విద్యార్థులు తర్ఫీదు లోని పలు అంశాలను తమ తమ నోటుబుక్సులో విషయాలను రాసుకున్నారు. ఇందులో భాగంగా ఓజేటి అధికారులు జి రామచంద్రం ట్రైనింగ్ కు సంబంధించిన అనేక అంశాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి,ఎలా ఈ ట్రైనింగ్ ను పూర్తి చేయాలో, విద్యార్థులకు పలు సూచనలను చేశారు. అనంతరం విద్యార్థుల యొక్క ట్రైనింగ్ కు సంబంధించిన నోట్ బుక్స్ ను వారు చూడటం జరిగింది ఇందులో భాగంగా కళాశాల ప్రధానాచార్యుల సలహా మేరకు డాక్టర్,మండలోజు నర్సింహ స్వామి విద్యార్థులను సందర్శించి క్రమశిక్షణకు సంబంధించిన అంశాలను విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు .























