ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా
45 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.. నియామక పత్రాల అందజేత…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో క్యూస్ కంపెనీ ఆఫ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి మండలంలోని 45 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్లు యూసఫ్ ఖాన్, వినయ్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంపై టాస్క్, ప్లేస్‌మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. శ్రీనివాస్ రెడ్డి, కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. కుమారస్వామి సంతోషం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. జ్యోతి కోఆర్డినేటర్లను అభినందించారు.

























