సితాయిపేట్ లో ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండల లోని సితాయిపేట్ గ్రామంలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఇంటింటా ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని సర్పంచ్ సిహెచ్ భూమేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి కలిసి మొత్తం 25 ఇంకుడు గుంతలకు ముగ్గులు వేసి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిహెచ్ భూమేష్ ఉప సర్పంచ్ చంద్రకాంత్, వార్డు సభ్యులు గోపి. సునిత.ముత్తనా. సకత్రి, ప్రవీన్ చేర్మన్ మౌనిక ప్రధానోపాధ్యాయురాలు నివరాణి. సుధాకర్ ‘గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.























