Homeతెలంగాణఅర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం...

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

నిజామాబాద్ రూరల్‌లో ఆరు డివిజన్లకు చెందిన 544 మందికి చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ

ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా అమలు చేస్తున్నాం: ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు.

శనివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్లకు చెందిన నూతన చేయూత పింఛన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 544 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.

డివిజన్లవారీగా పింఛన్ల వివరాలు:

– కాలూరు–ఖానాపూర్: 145 మంది

– గూపన్‌పల్లి: 59 మంది

– మాధవ్‌నగర్: 61 మంది

– బోర్గాం (పి): 87 మంది

– సారంగాపూర్: 143 మంది

– ముబారక్‌నగర్: 49 మంది

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గత పాలకులు రాష్ట్రంపై మోపిన అప్పుల భారం కారణంగా కొన్ని పథకాల అమలులో ఆలస్యం జరుగుతున్నప్పటికీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

అర్హత ఉండి ఇప్పటివరకు పింఛన్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రానున్న రోజుల్లో దశలవారీగా అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేసిన త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ అని, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమని పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందులు, గత ప్రభుత్వ అప్పుల భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పెద్ద వ్యాపారాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం సంవత్సరానికి రూ.20 వేల కోట్ల చొప్పున మూడేళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని మించి రూ.79 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని వివరించారు.

దివ్యాంగులకు నెలకు రూ.4,016, ఇతర అర్హులైన పింఛన్‌దారులకు నెలకు రూ.2,016 చొప్పున చేయూత పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ టవర్స్ ద్వారా పేదలకు గృహ వసతి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గతంలో రైతులకు మాత్రమే పరిమితమైన బీమా సౌకర్యాన్ని విస్తరించి, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2047 నాటికి తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రైజింగ్ తెలంగాణ–2047 విజన్‌తో ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధుల కేటాయింపులో తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి వెళ్తే తిరిగి కేవలం 42 పైసలే వస్తున్నాయని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా వారానికోసారి ప్రెస్‌మీట్లు పెట్టడానికే పరిమితమవుతున్నారని విమర్శించారు. తాను వైద్య వృత్తిని సైతం పక్కనపెట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు.

నిజామాబాద్ నగరంలో విలీనమైన గ్రామాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. విలీన గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత తనదేనని, ప్రజలు జరుగుతున్న అభివృద్ధి పనులను గమనించాలని కోరారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారితో పాటు కొత్తగా అర్హత సాధించిన వారికి కూడా నిబంధనల ప్రకారం పథకాల ప్రయోజనాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రభుత్వంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, సాయిరెడ్డి, బాగారెడ్డి, డివిజన్ల కార్పొరేటర్లు బోజన్న, హరిచంద్, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, రాజలింగం, అశోక్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కామారెడ్డి బస్టాండ్‌లో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: ప్రేమ పేరుతో జరిగే మోసాలు, సైబర్‌ నేరాలు, మైనర్ల...

చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత…

0
చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత రక్తదానంతో మానవత్వం చాటుకున్న ప్రసాద్ రక్తదాత ప్రసాద్‌కు అభినందనలు తెలిపిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ…

0
నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 8వ వార్డులో 25 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం: కౌన్సిలర్ మామరి సందీప్... త్రిశూల్ న్యూస్...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి…

0
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మైపాల్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు...

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక…

0
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ.. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

Translate »
error: Content is protected !!