లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్: కే. నగేష్
లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్ డిపో నుంచి టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి స్వయంగా ఆర్మూర్ బస్టాండ్‌లో ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేసి, అక్కడే ఉండి బస్సుల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతూ మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు.
భక్తుల సౌకర్యమే లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, స్వయంగా బస్టాండ్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి సేవలను పలువురు అభినందిస్తున్నారు.

























