గోవిందుపల్లిలో రీ సర్వే గ్రామసభ
రీ సర్వే అంశాలను పరిశీలించిన ఆర్డీవో రాజేంద్ర కుమార్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని గోవిందుపల్లిలో ఆదివారం రీ సర్వే గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ రీ సర్వేకు సంబంధించిన అంశాలను పరిశీలించి, గ్రామసభలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, ధర్పల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, రైతులు, గ్రామస్థులు, ఇన్‌చార్జ్ తహశీల్దార్ సాయిలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), సర్వేయర్, గోవిందుపల్లి జీపీఓ తదితరులు పాల్గొన్నారు.

























