Homeతెలంగాణతెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నింపేందుకు ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రేపు (సోమవారం) రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్‌లో జరిగే డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 9:20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. ఉదయం 10:20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వికారాబాద్‌కు బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ చేరుకుని, అక్కడి హరిత హోటల్‌లో జరిగే శిక్షణ తరగతులకు హాజరవుతారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు రోజంతా డీసీసీ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5:00 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణమవుతారు.

కీలక చర్చలు..

రాహుల్ గాంధీ పర్యటనలో కేవలం శిక్షణ తరగతులకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లను ఖరారు చేసే ఛాన్స్ ఉంది.మాజీ మావోయిస్ట్ నేతలతో భేటీ..రాహుల్ గాంధీ పర్యటనలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. మావోయిస్ట్ మాజీ అగ్రనేతలను కలవనున్నారు. ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై వారితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.వికారాబాద్‌లో భారీ ఏర్పాట్లు..రాహుల్ గాంధీ పర్యటన దృష్ట్యా వికారాబాద్ హరిత హోటల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. డీసీసీ అధ్యక్షులకు పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తారని సమాచారం. రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం రానుంది. ముఖ్యంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది.. KP

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా…

0
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా... జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ మోసపూరిత 1000 రోజుల పాలన పై...

భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

0
భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా...

బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా?

0
బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా? భారతదేశంలో ఆధార్ కార్డు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా 'బ్లూ రంగు' బాల ఆధార్‌ను జారీ చేస్తారు. ఇందులో పిల్లల...

పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21….

0
పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21.... భారతీయ తపాలా శాఖలో పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషా పరిజ్ఞానం...

రికార్డు స్థాయి పనితీరుతో ఆర్మూర్ డిపో సరికొత్త రికార్డ్…

0
రికార్డు స్థాయి పనితీరుతో ఆర్మూర్ డిపో సరికొత్త రికార్డ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్ ... TGSRTC ఆర్మూర్ డిపో ఉద్యోగులు సమిష్టి కృషి, అంకితభావం మరియు నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ రికార్డు...

Translate »
error: Content is protected !!