నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మొత్తం 340 హజ్ యాత్రికులకు రోగ నిర్ధారణ పరీక్షలు మరియు ముందు జాగ్రత్త టీకాలను ఇవ్వడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు.అందులో భాగంగా ముందుగా హజ్ యాత్రకులు అందర్నీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మార్చ్ 13 తేదీ నుండి 17వ తేదీ వరకు వివిధ రకాల రోగనిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు చేయడం జరుగుచున్నదని వాటిలో ముఖ్యంగా హైట్, వెయిట్, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇంకా ఇతర పరీక్షలు చేయడం జరుగుచున్నదని అన్నారు. మార్చి 17వ తేదీ తర్వాత ఎవరైతే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకు ముందు జాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా మరియు న్యూమోకొకల్ మేనేజైటీస్ టీకాలను ఈనెల మార్చి 23వ తేదీ రోజున ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. హజ్ యాత్రికులలో 60 సంవత్సరాలు పైబడిన 56 మంది హజ్ యాత్రి కులకు ఇన్ఫ్లుఎంజా టీకాలను, మొత్తం 340 మంది హజ్ యాత్రికులు అందరికీ న్యూమోకొకల్ మేనేoజైటిస్ టీకాను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, జిల్లా టీకాల నియంత్రణ అధికారి డాక్టర్ అశోక్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.























