Homeతాజా వార్తలుమహిళలకు అవకాశాన్ని ఇవ్వండి సమాజ అభివృద్ధిని పొందండి తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు...

మహిళలకు అవకాశాన్ని ఇవ్వండి సమాజ అభివృద్ధిని పొందండి తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు శ్రీ సంక్షేమ శాఖ మాత్యులు ధన సూరి సీతక్క

మహిళలకు అవకాశాన్ని ఇవ్వండి సమాజ అభివృద్ధిని పొందండి*తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు  సంక్షేమ శాఖ మాత్యులు ధన సూరి సీతక్క*మహిళలకు అవకాశాలు ఇవ్వటం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడతామని తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసురి సీతక్క అన్నారు.శుక్రవారం నాడు స్థానిక విజయలక్ష్మి గార్డెన్లో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా *నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్* ఆధ్వర్యంలో మహిళా సాధికారతకు అవగాహన సదస్సును నిర్వహించారు.ముందుగా ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం వందేమాతర గీతాన్ని ఆలపించి సభను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు సీతక్క* పాల్గొని మాట్లాడుతూ 1911లో కమ్యూనిస్టు నాయకురాలు జంక్షన్ అన్నగారి ఉన్న మహిళల అసమానత్వాన్ని నివారించుటకు పోరాటం చేశారు. దాన్ని పురస్కరించుకొని మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనీ అందులో భాగంగా 2026 సంవత్సరానికి గాను “గివ్ టు గైన్” అన్న నినాదాన్ని తీసుకోవడం జరిగిందని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలను ఇచ్చినట్లయితే వారి నుండి సమాజ అభివృద్ధికి ఎంతో పొందుతామని అర్ధాన్నిస్తుందని దానికి అనుగుణంగానే ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపుమేరకు మనందరం మహిళలకు ఆ అవకాశాలను ఇవ్వటమే కాకుండా వారికి బాసట గా నిలుద్దాము అని అన్నారు. మహిళా సాధికారత సాధించడంలో లింగ విభేదాన్ని విడనాడాలని , గివ్ టు గైన్ అన్న నినాదాన్ని సార్థకత చేసుకుంటూ సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళా సాధికారతకు పాటుపడదామని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా తన జీవితాన్ని ఒక ఉదాహరణగా ఆదర్శవంతమైన మహిళగా తీర్చి దిద్దుకొనుటకు చదువు ఎంతో ఉపయోగపడిందని మహిళా అభ్యున్నతికి విద్య ఎంతో తోడ్పడుతుందని అన్నారు. చదువు విజ్ఞానాన్ని ఇస్తుందని ఈ విజ్ఞానంతో సమాజంలో రాణిస్తామని అన్నారు.
ప్రతి విద్యార్థిని ఒక ఆదర్శవంతమైన వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మన మణంగా సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవటానికి వారి జీవిత చరిత్ర చదివి ఆ అభివృద్ధి వైపుగా అడుగులు వేయాలని అన్నారు. ప్రతి మహిళ కంపాషన్, కమిట్మెంట్, అండ్ కరేజ్ ను కలిగి ఉండాలని, చాలెంజ్ లేని జీవితం చప్పడి కూర వంటిదని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా నేను నా జీవితాన్ని గొప్పస్థాయిలో మలుచుకోగలిగిన అని అన్నారు. పదవ తరగతి చదువుతూ విప్లవోద్యమంలో వెళ్లిన నేను ఒక నక్సలైట్ గా ఏ కోర్టులో నిలుచున్నానో అదే కోర్టులో నేను అడ్వకేట్ గా నిలిచి నా గురుతుల్యులు అయినటువంటి వెంకటస్వామి రెడ్డి నీ ఆదర్శంగా తీసుకుని వారి ఆధ్వర్యంలో అదే కోర్టులో నిర్దోషిగా నిలబడగలిగానని అన్నారు. మహిళగా సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే సమస్యలను అధిగమించేలా ఉండాలని ఆత్మస్థైర్యము , ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. చదువు, క్రమశిక్షణతో మనం మనంగా నిరూపించుకోవాలని అది చదివైనా, పని అయినా ఏ రంగంలోనైనా మనంగా నిరూపించబడాలని అన్నారు. ఓటమి అనేది విజయానికి నాంది అన్న నానుడిని ఆదర్శంగా తీసుకోవాలని అబ్రహం లింకన్, మదర్ తెరిసా, మేరీకాన్ లాంటి ఆదర్శవంతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని మన అభివృద్ధికి అడుగులు వేయాలని అన్నారు. నేడు మహిళా సాధికారతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా అనేకమందికి జీరో వడ్డీ రూపేనా రుణాల అందిస్తూనే అనేక మందిని గొప్ప వ్యాపారవేత్తలుగా కోటి మందిని మహిళా వ్యాపారవేత్తలుగా చేయటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో 15 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు మహిళా సంఘాలలో సభ్యత్వాలను కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు కి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.ఈ సందర్భంగా *నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య* మాట్లాడుతూ సమాజంలోని మహిళల విజయాలను యువతగా మీకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా చైతన్యవంతమైన యువతకి అందించాలని లక్ష్యంతో సమాజంలోని చీడపీడలైన డ్రగ్స్ వంటి మహమ్మారిపై అవగాహన కల్పించాలని నేటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు నిజామాబాదు వ్యవసాయ ఆధారిత జిల్లాగా వ్యవసాయము వాణిజ్యము వైద్య పరంగా జిల్లాపై చుట్టుపక్కల ఉన్న జిల్లాలు ఆధారపడి ఉన్నాయని అలాంటి పరిస్థితుల్లో భద్రత కల్పించాలని ఆ భద్రత లో భాగంగా భద్రత , ట్రాఫిక్ భద్రత , సైబర్ భద్రత తదితర విషయాలపై యువతకు అవగాహన కల్పించి చైతన్యవంతులుగా చేయటమే నేటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు.ఈ సందర్భంగా నిజామాబాదు సెక్యూరిటీ కౌన్సిల్ బొచర్లను విడుదల చేశారు. “సురక్ష దీప్” అన్న భద్రతా బోర్డులను ప్రభుత్వ , ప్రైవేటు సంస్థల్లో ఏర్పాటు చేయాలని ఈ “సురక్ష దీప్” ప్రతి మహిళకు వారి సమస్యల పరిష్కారానికి ఒక భద్రతను కల్పించే దిశగా పనిచేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ , అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా , రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి , నిజామాబాద్ మేయర్ కె.ఉమారాణి, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్వీనర్ డిసిపి(అడ్మిన్ ) జి. బస్వా రెడ్డి , ట్రెజరర్ కే.సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కవిత రెడ్డి , ఎన్.ఎస్.సి సభ్యులు కాకతీయ కాలేజ్ రజినీకాంత్ , కామారెడ్డి ఏసిపి చైతన్య రెడ్డి , కామారెడ్డి డి.ఎఫ్.ఓ నిఖీత , నుడా చైర్మన్ కేశ వేణు, వివిధ కళాశాలకు చెందిన విద్యార్థిని లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

MSRDC క్రాస్‌విండ్‌లను పరిష్కరించడానికి ఈవే యొక్క కొత్త లింక్ బ్రిడ్జ్‌పై విండ్ బారియర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది

0
టైగర్ వ్యాలీ మీదుగా 650 మీటర్ల పొడవైన తీగల వంతెనపై అడ్డంకులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పూణే: మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే యొక్క...

ఇగత్‌పురి సమీపంలో ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు 5 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

0
పూణె: ఇగత్‌పురికి సమీపంలోని ముండే గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ...

ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని సిజెపికి చెందిన అభిజీత్ దీప్కే అన్నారు

0
పుణె: ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పు లేదని పేర్కొంటూ, గురువారం సాయంత్రం పూణెలో తమ నిరసన సందర్భంగా బొద్దింక జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు...

జూన్ 20న జంతర్ మంతర్ 2.0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీని విడిచి వెళ్లనని బొద్దింక...

0
పూణేలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) క్యాంపస్‌లో శాంతియుత నిరసనతో పాటు గ్రూప్ తన విద్యా మేనిఫెస్టోను ఆ రోజు విడుదల చేస్తుందని డిప్కే చెప్పారు....

లావణి, డ్రాగ్ మరియు డ్రామా: పూణే సత్రంగ్ ఫెస్ట్ క్వీర్ కథలను జరుపుకుంటుంది

0
అహోన్ గూప్తు తీసిన డ్రాగ్ డ్రామా 'ఐటెమ్' నుండి దృశ్యాలు (ఫోటో క్రెడిట్: నయనతార మజుందార్) పూణె: ఈ జూన్‌లో ఆరు రోజుల పాటు, సత్రంగ్ మహోత్సవ్ 2026 భారతదేశం అంతటా...

Translate »
error: Content is protected !!