వాటర్ ట్యాంక్ ఎక్కి విద్యార్థినిని కాపాడిన మహిళా సబ్ కలెక్టర్
తెలంగాణ : కామారెడ్డి జిల్లా బూర్గులో ఇంటర్ విద్యార్థిని ఫోన్ ఎక్కువగా చూస్తుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆమె కిందికి దిగలేదు. సమాచారం అందుకున్న మహిళా సబ్ కలెక్టర్ కిరణ్మయి అక్కడికి చేరుకుని, బాలికతో మాట్లాడుతూ ఆమెతో పాటు ట్యాంక్ పైకి ఎక్కారు. తల్లిదండ్రులు ఏమీ అనకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చి, ఆమెను సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు.

























