హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మరియు సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 16 నుండి 21 వరకు జరిగిన 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026 లో నిజామాబాద్ పోలీస్ విభాగానికి చెందిన సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా మెడల్స్ సాధించిన సిబ్బందిని నేడు నిజామాబాదు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో * నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.,* మెడల్స్ అందజేస్తూ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విధులతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లా పోలీస్ శాఖకు పేరు తెచ్చినందుకు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.వివిధ విభాగాలలో నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పాల్గొన్న సిబ్బంది 4 గోల్డ్ మెడల్స్ , 7 సిల్వర్ మెడల్స్ , 9 బ్రోంజ్ మెడల్స్ సాధించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అదనపు డీ.సీ.పీ (ఎ.ఆర్) రామచంద్రరావు మరియు పథకాలు సాధించిన పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.























