కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెడ్డు అశోక్ నియామకం అయ్యారు. ఇటీవల మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్బంగా తెడ్డు అశోక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకం ఉంచి మండల ఉపాధ్యక్షులు గా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మండలం లో పార్టీ బలోపేతం కొరకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన ఎంపిక కొరకు సహకరించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్, మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.























