ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోండి…
నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కోరారు.
ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయం, గమ్యస్థానానికి ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోవడం ద్వారా ప్రయాణ సమయంలో ఇబ్బందులు, ఆలస్యాలను నివారించవచ్చని తెలిపారు.
ఈ నెల 31న సోమవారం స్వస్థలాలకు లేదా తిరుగు ప్రయాణం చేసే వారు www.tgsrtcbus.in వెబ్‌సైట్‌తో పాటు రిజర్వేషన్ కౌంటర్లలో కూడా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ముందస్తు బుకింగ్ ద్వారా ప్రయాణికుల రద్దీని అంచనా వేసి, అవసరానికి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కావున ప్రయాణికులందరూ ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని వినియోగించుకుని తమ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవాలని రీజినల్ మేనేజర్ విజ్ఞప్తి చేశారు.

























