భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ ప్రతిపాదనల మేరకు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకాలకు ఆమోదం లభించింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నూతన కార్యవర్గ సభ్యులకు పార్టీ నాయకులు సూచించారు. మండల స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడంతో పాటు గ్రామస్థాయిలో కాంగ్రెస్ కార్యకలాపాలను విస్తరించేందుకు కార్యవర్గం సమిష్టిగా పనిచేయనుంది.
నియామకాలు ఇలా ఉన్నాయి:
అధికార ప్రతినిధిగా వాకా మహేష్ (భీమ్‌గల్)
ఉపాధ్యక్షులు:
కిష్టి చిన్న బాబన్న (బాబాపూర్)
తెడ్డు అశోక్ (ముచ్కూర్)
అరికెల సాయిలు (దేవక్కపేట్)
రామావత్ స్వామి నాయక్ (గోనుగొప్పుల)
గున్నాల శ్రీధర్ గౌడ్ (బడా భీమ్‌గల్)
కొత్త శంకర్ (బడా భీమ్‌గల్)
ప్రధాన కార్యదర్శులు:
జలం గౌడ్ (సికింద్రాపూర్)
తోట శివక్రాంతి (పురాణిపేట్)
రమేష్ నాయక్ (దేవన్‌పల్లి)
రాగుల మోహన్ (బడా భీమ్‌గల్)
సిద్ధపల్లి లక్ష్మణ్ (బాబానగర్)
అజర్ (బాబాపూర్)
వేముల వెంకమ్మ (భీమ్‌గల్)
దొనకంటి గంగాధర్ (పల్లికొండ)
కొయ్యాడి చిన్న కిష్టాగౌడ్ (ముచ్కూర్)
కార్యదర్శులు:
రాజేందర్ గౌడ్ (మెండోరా)
గట్టు సతీష్ (బడా భీమ్‌గల్)
పర్శ విఘ్నేష్ (జగిర్యాల్)
నూతనంగా నియమితులైన నాయకులకు కాంగ్రెస్ శ్రేణులు అభినందనలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధికి వారు కృషి చేయాలని ఆకాంక్షించారు.

























