భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో ముందస్తుగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు వై. చంద్రశేఖర్ రాఖీ పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత బాలికలు బాలురకు రాఖీ కడుతూ నేను నీకు రక్ష – నీవు నాకు రక్ష మనమందరం- దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రాఖీలు కట్టడం జరిగింది. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు ఆచార్యులకు కూడా రాఖీలు కట్టినారు.
పాఠశాలలో రాఖీలు కట్టడం పూర్తయిన తర్వాత పి.రాజేందర్, సిహెచ్. కార్తీక్, డి శ్రీనివాస్, ఎన్. రాకేష్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బాలికలు భీంగల్ పట్టణంలోని వ్యాపార సంస్థలలో ప్రభుత్వ కార్యాలయలలో కూడా రాఖీలు కట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు పి.సాయిచరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రెడ్డి జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇంచార్జ్ నోముల అశ్విన్ రెడ్డి పి.ఈ.టీ లు ఎస్. నరేష్, ఐ గంగాధర్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

























