ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై గురువారం గ్రామసభ నిర్వహించారు.
సర్పంచ్ మాలావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. జాబితాలో అర్హులైన వారి పేర్లు నమోదు చేయడం, పేర్లలో ఉన్న తప్పులను సవరించడం, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను నొక్కిచెప్పిన సర్పంచ్, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకుని, అవసరమైన సవరణలు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవింద్ నాయక్, వార్డు సభ్యులు, తండా పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

























