ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…
ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్
పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు అందరూ కలిసి మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని పోతంగల్ గ్రామంలో ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి వేడుకలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మిలాద్ ఉన్ నబి యాత్రతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోతంగల్ మండల బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులు సామాజిక సేవకర్త డాక్టర్ ఎం.ఏ హకీం హాజరై ముస్లిం సోదర సోదరీమణులకు పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు డాక్టర్ ఎం.ఏ హకీం ను శాలువాతో సన్మానించి అనంతరం జ్యూస్ స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఆనందోత్సవాలతో పండగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం.ఏ హకీమ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి కరుణ సోదర భావం సమానత్వం ఆదరించడం వంటి విలువలను ప్రతి ఒక్కరు ఆచరించాలని చెప్పారు. పేదలకు అండగా నిలవడం తోటివారిపట్ల దయ మానవత్వం తో మెలగడం ప్రవక్త చూపిన ఆదర్శ మార్గమని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా మతసామరస్యానికి గంగా. జమున సేహ జిబ్ కు ప్రతికల నిలుస్తుందని అన్ని మతాల ప్రజలు సోదరా భావంతో పండగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పోతంగల్ గ్రామ పెద్దలకు ముస్లిం సహోదరులు సోదర భావంతో శాలువతో సత్కరించి తదనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నబి, మూజిక మిటి ప్రెసిడెంట్ గఫర్, కోటగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కులకర్ణి అనిల్, మాజీ సర్పంచ్ రమేష్ సెట్, గాండ్ల విట్టల్, మాజీ ఎం.పి.టిసి కేశ వీరేశం, గంధం రాజు, జుమ్మా ఖాన్ ,మన్సూర్, పోతంగల్ గ్రామ ముస్లిం సహోదరులు తదితరులు పాల్గొన్నారు.























