పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను పెళ్లికాని యువతులు తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తొమ్మిదో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి తీజ్‌ను ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా తండాలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్య రమేష్ నాయక్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వీఆర్సీ సభ్యులు, తండా ప్రజలు పాల్గొన్నారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అరిగెల జనార్దన్, అక్ళూరు సర్పంచ్ జిన్నా జనార్దన్ తదితరులు పాల్గొని తీజ్ పండుగలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.

























