Homeతెలంగాణ18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు!

18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు!

18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు!

_ముందస్తు హెచ్చరికలు బేఖాతరు చేసిన సర్కార్‌_

_ఎండిపోయిన ఆరు వేలకుపైగా చెరువులు_

_అటవీ ప్రాంతాల్లోనూ తీవ్ర నీటి ఎద్దడి.. అల్లాడుతున్న వన్యప్రాణులు_

_ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో ఎక్కువ దుర్భిక్షం_

_హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 : రాష్ట్రంలోని 18 జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలంలో 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో 331 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఎల్‌ నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్ర కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉన్నదని వాతావరణ నిపుణులు ముందుగానే అంచనా వేశారు. గతంలో ఏ సంవత్సరాల్లో ఎల్‌ నినోతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉండబోతున్నదో వివరించారు. వానకాలం ముం దే నిపుణులు హెచ్చరించినప్పటికీ సర్కార్‌ పెడచెవిన పెట్టింది. కురిసిన ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాల్సిందిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒక సమయంలో కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించినప్పటికీ ఆ నీటిని ఎత్తిపోయకుండా మీనమేషాలు లెక్కించింది. నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులు నింపాలని బీఆర్‌ఎస్‌ నేతలు ఎంతమొత్తుకున్నా వినిపించుకోలేదు._

_చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చివర్లో నీటిని ఎత్తిపోసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. వానలు లేకపోవడంతో నదుల్లో ప్రవాహం తగ్గిపోయింది. సర్కార్‌ నిర్లక్ష్యం ఫలితాన్ని ఇప్పుడు ప్రజలతోపాటు అడవుల్లోని వన్యప్రాణులు సైతం అనుభవించాల్సిన దుస్థితి నెలకొన్నది. ఉత్తర తెలంగాణలోని జిల్లాలతో పోలిస్తే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కరువు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రధానంగా నల్లగొండ, జోగుళాంబ గద్వాల, వనపర్తి, మేడ్చల్‌ మలాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అంతటా కరువు చాయలు అలముకున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌ 23 నాటికి 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 812.5 మిల్లీమీటర్లు కాగా.. 618.7 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. 33 జిల్లాల్లో 18 జిల్లాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నాయి. జోగులాంబ గద్వాల 41 శాతం, నారాయణపేట, హనుమకొండ 35, నల్లగొండ జిల్లాలో 37, హైదరాబాద్‌ నగరంలో 27, మేడ్చల్‌ జిల్లాలో 33, రంగారెడ్డిలో 14 శాతం చొప్పున లోటు వర్ష పాతం నమోదైంది._

*_వన్యప్రాణులకూ తీవ్ర నీటి సమస్య_*

_రాష్ట్రంలోని అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ ఏటూరునాగారం, కిన్నెరసాని, కాసు బ్రహ్మానందరెడ్డి, మహావీర్‌ హరిణ వనస్థలి, మృగవని జాతీయ పారులు, మంజీరా మొసళ్ల అభయారణ్యం, ప్రాణహిత, పాకాల, పోచారం అభయారణ్యాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. అడవుల్లోని సహజ నీటి వనరులు, చెరువులు, వాగులు ఎండిపోయాయి._

_రాష్ట్రంలో అధికారికంగా 21,500 సాగునీటి చెరువులున్నాయి. అయితే వీటిలో ప్రస్తుతం కేవలం 550 చెరువుల్లో మాత్రమే నీళ్లున్నాయి. మహబూబ్‌ జిల్లాలో 331 చెరువులకుగాను 8 మాత్రమే నిండుగా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 105 చెరువుల్లో మూడింటిలో మాత్రమే పూర్తిగా నీళ్లున్నాయి. మేడ్చల్‌ మలాజిగిరి జిల్లాలో 97 చెరువులు, జయశంకర్‌ భూపాలపల్లిలో 367, వరంగల్‌ రూరల్‌ 351 చెరువులు ఉండగా, వీటిలో కేవలం నాలుగేసి చెరువుల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయి. వరంగల్‌ అర్బన్‌ 649 గాను 5 చెరువుల్లో మాత్రమే నిండుగా నీరుంది. వనపర్తిలో 222, వికారాబాద్‌లో 310 చెరువుల్లో 6 చొప్పున చెరువులు నిండుగా ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న 275 చెరువుల్లో కేవలం 7 మాత్రమే పూర్తిగా నిండాయి. దాదాపు 6,123 చెరువుల్లో చుక నీరు లేదు._

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పుప్పాల పెంటయ్య భార్య ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్...

తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తాళ్లారంపూర్ : నవ్యభారతి స్కూల్ కరస్పాండెంట్ రాజపూర్ణానందం అన్న ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్...

మద్యం తాగి వాహనం నడపవద్దు! 

0
 మద్యం తాగి వాహనం నడపవద్దు! ⚠️ మద్యం సేవించడం వల్ల ఆలోచనా శక్తి తగ్గి, ప్రమాదాన్ని గుర్తించే వేగం మందగిస్తుంది. 🚗 మీరు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేయవచ్చు. 🛡️...

ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం ప్రత్యేక హోమం, అమ్మవారి కల్యాణమహోత్సవంభక్తులకు అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రేణుక ఎల్లమ్మ తల్లి...

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై సీఎం హెచ్చరికలు!

0
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై సీఎం హెచ్చరికలు! విద్యుత్ పొదుపు చేయండి.. ఆరుతడి పంటల వైపు మళ్లండి! తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రజలు, రైతులు ముందస్తు...

Translate »
error: Content is protected !!