ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా నరేష్ గౌడ్ నియామకం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని లో జరిగిన కార్యక్రమంలో నరేష్ గౌడ్‌ను ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మరియు ఓబీసీ మోర్చా అధ్యక్షులు వేణు ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

























