Homeతెలంగాణ5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 నిర్వహణపై పోలీస్ కమిషనర్ సమీక్ష...

5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 నిర్వహణపై పోలీస్ కమిషనర్ సమీక్ష…

5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 నిర్వహణపై పోలీస్ కమిషనర్ సమీక్ష

క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్: నిజామాబాద్‌లో నవంబర్ 2026లో నిర్వహించనున్న 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన ట్రాక్‌ల ఏర్పాటు, క్రీడా మైదానాల సిద్ధీకరణ, క్రీడాకారులకు వసతి, వైద్య సేవలు, తాగునీటి సరఫరా, భోజన ఏర్పాట్లు తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు.

వివిధ ప్రాంతాల నుంచి క్రీడా పోటీల్లో పాల్గొనే పోలీస్ క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. క్రీడాకారులకు నాణ్యమైన వసతి, భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన వైద్య సిబ్బందిని, ప్రథమ చికిత్స సదుపాయాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026ను విజయవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఈ క్రీడా పోటీలను పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (జన్‌కంపేట్), అలీసాగర్, నాగారం గ్రౌండ్, కాలూరు రోడ్డు, ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్, ముగుపాల్ ఆర్చరీ అకాడమీ తదితర ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్‌తో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీటీసీ, ఏఆర్, ఐటీ, సీసీఆర్‌బీ, ట్రాఫిక్ విభాగాలకు చెందిన ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, కృష్ణ, నరేందర్, గురు నాయుడు, మస్తాన్ అలీ పాల్గొన్నారు.

అలాగే డీవైఎస్‌ఓ బి. పవన్ కుమార్, ఆర్చరీ కోచ్ రవీందర్, స్విమ్మింగ్ కోచ్ మహిపాల్ రెడ్డి, అథ్లెటిక్స్ సెక్రటరీ రాజా గౌడ్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయ్ కాంత్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరాజ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పుప్పాల పెంటయ్య భార్య ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్...

తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తాళ్లారంపూర్ : నవ్యభారతి స్కూల్ కరస్పాండెంట్ రాజపూర్ణానందం అన్న ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్...

మద్యం తాగి వాహనం నడపవద్దు! 

0
 మద్యం తాగి వాహనం నడపవద్దు! ⚠️ మద్యం సేవించడం వల్ల ఆలోచనా శక్తి తగ్గి, ప్రమాదాన్ని గుర్తించే వేగం మందగిస్తుంది. 🚗 మీరు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేయవచ్చు. 🛡️...

ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం ప్రత్యేక హోమం, అమ్మవారి కల్యాణమహోత్సవంభక్తులకు అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రేణుక ఎల్లమ్మ తల్లి...

18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు!

0
18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు! _ముందస్తు హెచ్చరికలు బేఖాతరు చేసిన సర్కార్‌_ _ఎండిపోయిన ఆరు వేలకుపైగా చెరువులు_ _అటవీ ప్రాంతాల్లోనూ తీవ్ర నీటి ఎద్దడి.. అల్లాడుతున్న వన్యప్రాణులు_ _ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో ఎక్కువ...

Translate »
error: Content is protected !!