ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం
ప్రత్యేక హోమం, అమ్మవారి కల్యాణమహోత్సవంభక్తులకు అన్నదానం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ఏడవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించడంతో పాటు అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వార్షికోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, సురేందర్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

























