కల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గ్రామంలో ఈరోజు కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి చెక్కులు ఆగిపోయాయని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఈర్ష్యతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో కల్యాణలక్ష్మి పథకం నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన నిరుపేదలకు తప్పకుండా చెక్కులు అందుతాయని తెలిపారు.
అలాగే అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, వితంతు, ఒంటరి మహిళలకు పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరిగేల జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి జితేందర్, జీపీ ఓ గంగాధర్, ఉపసర్పంచ్ రంజిత్, జేమ్స్, పల్లె శ్రీనివాస్, వి.డి.సి. సభ్యులు, మండల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు నారాయణ, మహిపాల్, స్వామి, గంగారం తదితరులు పాల్గొన్నారు.























