సితాయిపేట్లో ఎస్ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఎస్ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ టీ. శాంత, సర్పంచ్ సి.ఎస్. భూమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. అర్హులైన కొత్త ఓటర్ల పేర్ల నమోదు, జాబితాలో తప్పులు ఉంటే సవరణలు, తొలగింపులు తదితర అంశాలపై గ్రామస్థులకు అధికారులు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగేటి చంద్రకాంత్, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

























