ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్గల్ ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వివరాలు సక్రమంగా నమోదు కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో భీమ్గల్ మండలం బెజ్జోర గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. నోటీసులు అందుకున్న వారి నుంచి అవసరమైన వివరాలను సేకరించి, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో బూత్ లెవల్ అధికారులు (BLOలు) నమోదు చేస్తున్న ప్రక్రియను ఎంపీడీవో జి. సంతోష్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా BLOలకు పలు సూచనలు జారీ చేస్తూ, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో వివరాలు సరిగా నమోదు కాని వారి నుంచి వివరాల సేకరణ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.
నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు సహకరించాలని ఎంపీడీవో సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కార్తిక్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, జీపీఓ, బూత్ లెవల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























