పిప్రిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
పిప్రి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులకు సోమవారం ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని నాయకులు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచన మేరకు ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రతి గ్రామాన్ని గుడిసెలు లేని గ్రామంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరిగెల జనార్ధన్, ఉపసర్పంచ్ రంజిత్ జేమ్స్, పార్టీ అధ్యక్షుడు రాజేష్, పంచాయతీ కార్యదర్శి జితేందర్, కాంగ్రెస్ నాయకులు దుర్గి రాజేందర్ గౌడ్, కోమనపల్లి గంగారం, రంజిత్ ప్రసాద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

























