ఉపాధ్యాయుడిగా నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు – మిట్టపల్లి ధర్మేందర్‌కు ఘన ఉద్యోగ విరమణ సన్మానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
నిజామాబాద్ జిల్లా,కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్)గా విధులు నిర్వహించిన శ్రీ మిట్టపల్లి ధర్మేందర్ ఉపాధ్యాయుడుగా నాలుగు దశాబ్దాలకు పైగా విద్యారంగానికి అందించిన విశిష్ట సేవలను పురస్కరించుకుని సోమవారం ఘనంగా ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, మానవీయ విలువలను పెంపొందించడంలో ధర్మేందర్ విశేష కృషి చేశారనీ కమ్మర్పల్లి మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య అన్నారు .ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి, అనేక సంవత్సరాల పాటు విద్యార్థుల అభ్యున్నతికి అంకితభావంతో సేవలందించారనీ ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మాట్లాడుతూ ధర్మేందర్ టీచర్ సుదీర్ఘ సేవలను, సహచరులతో ఆయనకు ఉన్న స్నేహపూర్వక సంబంధాలను, విద్యార్థుల పట్ల ఆయన చూపిన ఆప్యాయతను, వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను కొనియాడారు. ఆయన సేవలు భావితరాల ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ అనంతరం ధర్మేందర్ ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, సమాజానికి తన అనుభవాలను మరింతగా అందించాలని పాఠశాల కుటుంబం ఆకాంక్షించింది.
ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ అరుణ్ రెడ్డి,ఉప సర్పంచ్ ఉదయ్, బషీరాబాద్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ముపకల్ మండల విద్యాధికారి గంగారం ,వివిధ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా ,మండల బాధ్యులు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని మిట్టపల్లి ధర్మేందర్ కి ఘనంగా వీడ్కోలు పలికారు.

























