పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా లో ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సితాయిపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనంలోని గణేష్ మండపం వద్ద యజ్ఞం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్లాస్టిక్ ప్లేట్లు కాకుండా స్టీల్ ప్లేట్లులో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యజ్ఞ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కొండ్యాల వినోద్. చిలుక నరేష్, రవి దంపతులు సంఘ పెద్దలు కుల సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి సీతయ్యపేట్ పద్మశాలి సంఘ కార్యవర్గ సభ్యులు మరియు యూత్ సభ్యులు కుల మరియు తదితరులు పాల్గొన్నారు

























