జూరాల కాదు.. మోదీ వద్దకు వెళ్లండి: మంత్రి జూపల్లి…
తెలంగాణ : బీజేపీ నాయకులు జూరాల ప్రాజెక్టు వద్దకు కాకుండా ప్రధాని మోదీ వద్దకు వెళ్లాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించాలని, ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.20 వేల కోట్ల కరువు నిధులను సాధించాలని సవాల్ విసిరారు. ఎల్నినో నేపథ్యంలో రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గడంతో బీఆర్ఎస్, బీజేపబీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.























