రైతులకు రూ.813 కోట్లు వెంటనే చెల్లించండి: మంత్రి ఉత్తమ్…
తెలంగాణ : భూసేకరణ, పునరావాసం కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.813 కోట్ల నిధులను జాప్యం చేయకుండా వెంటనే రైతులకు చెల్లించాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఉన్నతాధికారులు, కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో హైదరాబాద్లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. విడుదలైన నిధులు ప్రభుత్వ ఖాతాల్లోనే ఉండిపోతే సహించబోనని మంత్రి హెచ్చరించారు.























