నిధులున్నా ఆలస్యమెందుకు: సీఎం రేవంత్…
తెలంగాణ : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో జాప్యంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేస్తున్నా పనులు ఎందుకు మందకొడిగా సాగుతున్నాయని అధికారులను ప్రశ్నించారు. రానున్న 30 రోజులు రోజుకు 24 గంటలూ మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టాలని, ఇంజనీరింగ్ అధికారులు వర్క్ షెడ్యూల్ రూపొందించుకోవాలని ఆదేశించారు. సీఎంవో అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలని, ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.























