కుట్టుమిషన్లకు 4.6 లక్షల దరఖాస్తులు: మంత్రి పొన్నం…
తెలంగాణ : బీసీ మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకానికి ఇప్పటివరకు 4.6 లక్షల దరఖాస్తులు అందాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ 30వ తేదీతో ముగుస్తుందని, అర్హులైన ప్రతి బీసీ మహిళకూ ప్రయోజనం చేకూర్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాలు, హాస్టళ్ల పనితీరుపై కూడా చర్చించారు.























