దుర్గామాత మండపాలకు ఉచితంగా చీరల పంపిణీ…
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సహకారంతో కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి పట్టణంలోని దుర్గామాత మండపాలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సహకారంతో పట్టణంలోని పలు దుర్గామాత మండపాల నిర్వాహకులకు చీరలను అందజేశారు. కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డు బీజేపీ ఇన్‌చార్జి చిన్నొల్ల రాజనీకాంత్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దుర్గామాత మండపాల నిర్వాహకులకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్‌రావు, సరికొండ ప్రభాకర్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, 12వ వార్డు అధ్యక్షులు, సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.























