లిటిల్ కింగ్ యూత్ ఆధ్వర్యంలో దేవి మండపం వద్ద యజ్ఞం, అన్నదాన వితరణ కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో లిటిల్ కింగ్ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు.
వేదమంత్రాల నడుమ అమ్మవారిని పూజించి లోకకల్యాణం కోసం ప్రార్థనలు చేశారు.అనంతరం లిటిల్ కింగ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ కింగ్ యూత్ సభ్యులు కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























