రామడుగులో పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు, ఇన్సూరెన్స్ పంపిణీ…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రామడుగు గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించారు.
గ్రామ సర్పంచ్ పార్వతి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలతో పాటు సబ్బులు, నూనెలను పంపిణీ చేశారు. అదేవిధంగా సిబ్బందికి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించారు.
ఈ సందర్భంగా సిబ్బందికి పండుగ కానుకలు అందజేయడం పట్ల హర్షం వ్యక్తమైంది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లోలం రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, పాలకవర్గ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

























