Homeతెలంగాణభీంగల్ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి...

భీంగల్ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి…

భీంగల్ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: నిజామాబాద్ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన భీంగల్ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ భీంగల్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీంగల్ మండలంలో ప్రధానంగా వరి పంట సాగు చేస్తారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఎల్‌నినో ప్రభావంతో బోరుబావులు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కనీసం కరువు మండలాల జాబితాలోనైనా భీంగల్‌కు చోటు దక్కుతుందని రైతులు ఆశించారని, కానీ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో భీంగల్ మండలాన్ని చేర్చకపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే భీంగల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు వేముగంటి ప్రాజెక్టు లిఫ్ట్, కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని పలు లిఫ్ట్‌లకు నీటిని అందించడంతో పాటు పెద్దవాగు, కప్పలవాగు నింపి రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న నాయకులకు భీంగల్ మండల రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అన్వేష్ రెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులు భీంగల్ రైతుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డి భీంగల్ మండలంపై చిన్నచూపు చూస్తున్నారని, తనకు ఇక్కడ ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదనే కారణంతో మండలానికి అన్యాయం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని నర్సయ్య ఆరోపించారు.

మరోవైపు రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని సాగునీరు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటి నుంచే శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

భీంగల్ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించకపోతే ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మహేష్ కుమార్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, సునీల్ రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని దొనకంటి నర్సయ్య డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్, ఇక్రమ్, సిద్ధపల్లి రాములు, జీసన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

0
ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై...

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

0
భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక. నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

0
క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల...

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

0
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు...

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర…

0
గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర                                   ...

Translate »
error: Content is protected !!