Homeత్రిశూల్ న్యూస్శబరిమల యాత్రికుల ఆరోగ్య భద్రతకు ప్రత్యేక చర్యలు...

శబరిమల యాత్రికుల ఆరోగ్య భద్రతకు ప్రత్యేక చర్యలు…

శబరిమల యాత్రికుల ఆరోగ్య భద్రతకు ప్రత్యేక చర్యలు

‘స్వస్త్యం శరణం – ఆరోగ్యకరమైన శరణయాత్ర’ పేరుతో ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమం

హోటళ్లు, ఆహార సంస్థల్లో పరిశుభ్రత తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…

శబరిమల మండల పూజ, మకరవిళక్కు ఉత్సవాల నేపథ్యంలో అయ్యప్ప భక్తుల ఆరోగ్య భద్రతకు కేరళ ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. యాత్రా సమయంలో అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘స్వస్త్యం శరణం – ఆరోగ్యకరమైన శరణయాత్ర’ పేరుతో ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది.

ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె. మణికందన్ మాట్లాడుతూ.. మండల పూజ, మకరవిళక్కు ఉత్సవాల కోసం ఆరోగ్య శాఖ ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని తెలిపారు.

ప్రచారంలో భాగంగా హోటళ్లు, ఆహార సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఈరోజు ఉదయం 10:30 గంటలకు పంపాలోని శ్రీరామ సాకేతం హాల్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఎ. నిజాముద్దీన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది.

అలాగే ఆరోగ్య శాఖ బృందాలు హోటళ్లు, ఆహార సంస్థలను సందర్శించి పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేయడంతో పాటు అవసరమైన సూచనలు అందించనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మరోవైపు నకిలీ ఆరోగ్య కార్డుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆహార సంస్థల్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్య కార్డుల ప్రామాణికతను పరిశీలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య సిబ్బందిని నియమించడంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఎంఓ తెలిపారు. యాత్రికులకు ఆరోగ్య, భద్రతా సూచనలు అందించే సమాచార బోర్డుల ఏర్పాటు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు.

యాత్రికుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

0
ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై...

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

0
భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక. నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

0
క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల...

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

0
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు...

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర…

0
గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర                                   ...

Translate »
error: Content is protected !!