మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు: ఎస్సై సందీప్ హెచ్చరిక…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ధర్పల్లి ఎస్సై జి. సందీప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ధర్పల్లి శివారులో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వాహనాలు నడుపుతున్న వారికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ, వాహనాలను నడపాలని సూచించారు. ఏఎస్ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.























