Homeతెలంగాణఅంగరంగ వైభవంగా నిజామాబాద్‌లో మాదిగ మహారాజుల శోభాయాత్ర...

అంగరంగ వైభవంగా నిజామాబాద్‌లో మాదిగ మహారాజుల శోభాయాత్ర…

అంగరంగ వైభవంగా నిజామాబాద్‌లో మాదిగ మహారాజుల శోభాయాత్ర

ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. విశారదన్ మహారాజ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాదిగ జాగృతి సంఘం (MJS) ఆధ్వర్యంలో నవంబర్ 1న మాదిగ మహారాజుల శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు.

డప్పు వాయిద్యాలు, డీజేలు, కోలాటాలు, సాంస్కృతిక కళాబృందాల ప్రదర్శనలు, ఆటపాటలతో శోభాయాత్ర ఉత్సాహభరితంగా సాగింది. బోర్గం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పులాంగ్, ఎల్లమ్మగుట్ట మీదుగా ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుంది.

అనంతరం నిర్వహించిన రోడ్‌షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గమని పేర్కొన్నారు. ఒకప్పుడు మహారాజులుగా జీవించిన మాదిగ జాతికి వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం, జంబూద్వీప రాజ్య చరిత్ర ఉన్నాయని అన్నారు. అయితే, చారిత్రక ఘనత కలిగిన మాదిగ జాతి నేడు అంటరానితనానికి గురై గ్రామాల చివరన జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మాదిగ జాతి తిరిగి ఆత్మగౌరవంతో, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా అంబేద్కర్ అందించిన రాజ్యాంగం, ప్రజాస్వామ్య మార్గాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాదిగలే పరిపాలించాలనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ స్వశక్తితో తమ హక్కుల కోసం పోరాడాలని, అదే సమయంలో ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాల హక్కుల పరిరక్షణకు కూడా మాదిగలు ఉద్యమించాలని డా. విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో MJS నాయకులు సుమన్, ప్రేమ్, మహిపాల్, నాగేశ్వర్, సంతోష్, రాజు, సాయినాథ్, భగేంద్ర, సుదర్శన్, మహేందర్‌తో పాటు మాదిగ విద్యావంతులు, ఉద్యోగులు, మహారాజులు, మహారాణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

0
ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై...

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

0
భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక. నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

0
క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల...

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

0
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు...

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర…

0
గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర                                   ...

Translate »
error: Content is protected !!