గుత్ప ఎత్తిపోతల పాదయాత్రకు ధర్పల్లి మండల బీజేపీ నాయకుల మద్దతు
భారీగా తరలివెళ్లిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా: గుత్ప ఎత్తిపోతల పథకం పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ ఇందూరు జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రకు ధర్పల్లి మండల బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ధర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు జీర్రా మహిపాల్ నాయకత్వంలో మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొనేందుకు తరలివెళ్లారు.
గుత్ప ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు.

























