హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ గ్రామంలో సోమవారం 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆశవ్వ బాబన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాఘవేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సుదర్శన్, కార్యదర్శి గంగాధర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

























