గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర నిజామాబాద్ జిల్లా లో జక్రాన్పల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి గుత్ప ప్రాజెక్టు వరకు రైతులతో పాదయాత్ర…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా: గుత్ప ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి గుత్ప ప్రాజెక్టు వరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు. కులాచారి.దినేష్ ఆధ్వర్యంలో రైతులు,పార్టీ నాయకులు పాదయాత్ర చేపట్టారు.ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ గుత్ప ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకనసాగుతుండటంతో రైతులు సాగునీటి కోసం తీవ్రఇబ్బందులుఎదుర్కొంటున్నారని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెనుక జలాలతో జక్రాన్పల్లి మండలానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేసిందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనేస్పందించి పెండింగ్ పనులకు నిధులు కేటాయించి పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.పనులు వేగవంతం చేయకపోతే రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి.స్రవంతి, రైతులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.























