Homeతెలంగాణబెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి...

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు వినతి’నిజామాబాద్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీం అమలులో జరుగుతున్న అక్రమాలు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయంపై ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యు ) ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ సురేష్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా పిడిఎస్ యు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు. కర్క గణేష్,ప్రధాన కార్యదర్శి. ఎల్. అనిల్ కుమార్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థల్లో వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో బెస్ట్ అవైలబుల్ స్కీంను ప్రవేశపెట్టిందని,అయితే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాన్ని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నాయనివిమర్శించారు2020-21విద్యాసంవత్సరం నుంచి ప్రస్తుత విద్యాసంవత్సరం వరకు ప్రభుత్వం సంబంధిత శాఖల ద్వారా ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యార్థుల ఫీజుల నిధులను విడుదల చేసినప్పటికీ, తమకు ప్రభుత్వం నుంచి నిధులు అందలేదని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ప్రతి సంవత్సరం అదనంగా ఫీజులు వసూలు చేశారనితెలిపారు.ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెల్లించిన డబ్బులను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతంఆడబ్బులనుతిరిగిఇవ్వకుండా యాజమాన్యాలుకాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు.ముఖ్యంగా నిజామాబాద్ నగరంలోని విజ్ఞాన్ హైస్కూల్ యాజమాన్యం బెస్ట్ అవైలబుల్ స్కీంలో చదువుతున్న అనేకమంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి గత నాలుగు సంవత్సరాలుగా ఒక్కో విద్యార్థికి సుమారు రూ.30 వేల నుంచి రూ.32 వేల వరకు అదనంగా వసూలు చేసిందని, ప్రభుత్వం నుంచి ఫీజులనిధులుయాజమాన్యం ఖాతాలో జమ అయినప్పటికీ తల్లిదండ్రులకు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని పేర్కొన్నారు.అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీంలో చదువుతున్న విద్యార్థులకు హాస్టళ్లలో సరైన వసతులు కల్పించకుండా,నాణ్యమైన భోజనం అందించకుండా కొన్ని విద్యాసంస్థలు నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నాయన్నారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య,వసతి కల్పించాల్సిన పథకాన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఆదాయవనరుగామార్చుకోవడందుర్మార్గమనివిమర్శించారు.జిల్లా అధికారులు వెంటనే స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కీం అమలవుతున్న అన్ని విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, హాస్టల్ వసతులు,భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలని, ప్రభుత్వనిధులవినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు.నాసిర్, సహాయ కార్యదర్శి.వినోద్ కుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

0
ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై...

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

0
భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక. నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

0
క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల...

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర…

0
గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర                                   ...

హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ…

0
హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ గ్రామంలో సోమవారం...

Translate »
error: Content is protected !!