Homeకమ్మర్‌పల్లి మండల్క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి

బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల విరాళం

వెయ్యి మందికి మూడు రోజుల పాటు ఉచిత భోజన సదుపాయం

ఘనంగా 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

కమ్మర్‌పల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నేటి ఆధునిక కాలంలో చిన్నారులు, యువత స్మార్ట్‌ఫోన్లు, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ప్రతిరోజూ కనీసం గంటసేపు క్రీడా మైదానాల్లో గడిపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహించిన 70వ అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి అభినందించారు. మార్చ్‌ఫాస్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు జ్ఞాపికలు అందజేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు చదువు, విజ్ఞానం ఎంత ముఖ్యమో, శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వానికి క్రీడలు కూడా అంతే అవసరమన్నారు. నియోజకవర్గంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా నిరంతరం క్రీడా పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువులకే పరిమితం చేయకుండా వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు.

క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో వ్యాయామ ఉపాధ్యాయుల (పీఈటీలు) కృషి అభినందనీయమని కొనియాడారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సొంత కార్యక్రమంలా భావించి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పీఈటీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా పోటీల విజయానికి వారి కృషే ప్రధాన కారణమన్నారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటూ, బషీరాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు, డెస్క్ బెంచీల ఏర్పాటు కోసం దాత దయానంద్ రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇలాంటి విరాళాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీలకు వివిధ పాఠశాలల నుంచి హాజరైన సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు వరుసగా రెండో ఏడాది కూడా ఉచిత భోజన సదుపాయం కల్పించిన స్థానిక దాతను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. భోజన ఏర్పాట్లకు అవసరమైన నిత్యావసర సరుకులు, వంట ఖర్చులను సొంత నిధులతో సమకూర్చడం గొప్ప సేవాభావానికి నిదర్శనమన్నారు.

అలాగే క్రీడా పోటీలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేస్తున్న సుమారు 400 మంది గ్రామ యువత, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ), స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజాప్రతినిధులు, నిర్వహణ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.

ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో సాధన చేయాలని విద్యార్థులకు సూచించారు. విజయం సాధించిన వారు కూడా గర్వపడకుండా తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయులు, అధికారులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

– త్రిశూల్ న్యూస్, నిజామాబాద్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

0
ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై...

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

0
భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక. నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం...

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

0
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు...

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర…

0
గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర                                   ...

హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ…

0
హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ గ్రామంలో సోమవారం...

Translate »
error: Content is protected !!