Homeతెలంగాణఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్...

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్

గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత

యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై ఆసక్తి, పట్టుదలతో పరిశోధన రంగంలో రాణించి భీమ్‌గల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన బాదవత్ సంతోష్ ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ పట్టా సాధించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆయన ఈ ఘనత సాధించడం సికింద్రాపూర్ గ్రామంతో పాటు భీమ్‌గల్ మండలానికి గర్వకారణంగా నిలిచింది.

రాజస్థాన్ రాష్ట్రంలోని ఝున్‌ఝును ప్రాంతంలో ఉన్న ఎస్‌జేజేటీయూ విశ్వవిద్యాలయం సోమవారం ఆయనకు డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. విశ్వవిద్యాలయంలో డాక్టర్ అన్షు శర్మ మార్గదర్శకత్వంలో సంతోష్ ‘భారత స్వాతంత్ర్య కాలంలో సాహిత్యం యొక్క ప్రభావం’ అనే అంశంపై పరిశోధన చేపట్టారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో సాహిత్యం ప్రజల్లో జాతీయ భావాలను, దేశభక్తిని, స్వాతంత్ర్య కాంక్షను పెంపొందించడంలో పోషించిన కీలక పాత్రను తన పరిశోధనలో విశ్లేషించారు. ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

మారుమూల గ్రామానికి చెందినప్పటికీ ఉన్నత విద్యపై ఆసక్తితో నిరంతరం కృషి చేస్తూ పరిశోధన రంగంలో ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల యువత పట్టుదలతో ముందుకు సాగితే విద్యా, పరిశోధన రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనేందుకు బాదవత్ సంతోష్ విజయం నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సంతోష్ సాధించిన ఈ అరుదైన ఘనతపై సికింద్రాపూర్ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో విద్యా, పరిశోధన రంగాల్లో మరిన్ని విజయాలు సాధించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

0
భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక. నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

0
క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల...

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

0
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు...

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర…

0
గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర                                   ...

హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ…

0
హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ గ్రామంలో సోమవారం...

Translate »
error: Content is protected !!